“యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్”
హనుమాన్ చాలీసా పారాయణ మరియు శ్రీరామ నామము
పారాయణ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మనము కనమర్లపూడి లోని శ్రీ భక్త వీర హనుమాన్ దేవాలయం అతి త్వరిత గతిన పూర్తి అవ్వాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ పారాయణం అందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు.
17-07-2024 నుండి 19-11-2024 వరకు మొత్తం (126 రోజులు) total count
హనుమాన్ చాలీసా: 49,004 సార్లు
శ్రీరామ నామం: 8,59,059 సార్లు
ఈ పారాయణ లో భాగస్వాములైన మీ అందరికీ మా భక్త వీర హనుమాన్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు.
1. MELLACHERUVU SUVARCHALA
2. MELLACHERUVU SUBRAHMANYAM
3. MELLACHERUVU SWARNALATHA
4. MELLACHERUVU BHARGAVA
5. MADDURI SRINIVASARAO
6. MADDURI VIDYA ANNAPURNA
7. MADDURI MARUTHI
8. MADDURI SRUTHI
9. MADDURI MANOJ
10. JAGARLAPUDI RAMA GOPAL
11. JAGARLAPUDI LALITHA
12. KOTA PRASUNA
13. KOTA LALITHA SMARANI
14. MALLADI SITHA SASTRY
15. ANDUKURI INDIRA
16. RENTACHINTHALA BINDU
17. GADIVEMULA SIREESHA
18. JAYANTHI CHAYA
19. GUNTURU GAYATHRI
20. MALLIPEDDI SUBBAYAMMA
21. CHALLA NAGALAKSHMI
22. SAGI KANAKA LAKSHMI KUMARI
23. MAGANTI PARVATHI
24. TANGIRALA SATYAVATHI
25. MAMIDALA NAGALAKSHMI
26. JANAPATI VENKATA RAMA KRISHNA PRASAD
27. MANNAVA DHANALAKSHMI
28. KOLLA VENKATA ANURADHA
29. KUNDURTHI KARUNA
30. DASARI MADHAVI
31. NIMMARAJU CHANDRA SIREESHA
32. GUNTURU MADHAVI
33. SEETHIRAJU SUDHARANI
34. M. PAVANI
35. A.S.H. ANUPAMA
36. V. ANANTHA LAKSHMI
37. P. VARA LAKSHMI
38. C. ANJANI
39. CH. JYOTHI
40. NAGA LAKSHMI
41. G. ANURADHA
42. CHIVUKULA LAKSHMI
43. VASUNDHARA
44. NIMMAGADDA LAKSHMI
45. B. KANAKA DURGA
46. ANNAPURNA
ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పారాయణ చేసి మన అందరి సంకల్పం తరంగాలుగా ఆ ఆంజనేయస్వామి వద్దకు చేరి మన యొక్క సంకల్ప దీక్ష అతి త్వరలో నిర్విఘ్నం గా పూర్తి కావాలని ఆ రామదూత హనుమంతుని ప్రార్ధిస్తున్నాను.
జై హనుమాన్
Note: పారాయణ వాట్సప్ గ్రూప్ లో సభ్యులు గా చేరటానికి ఈ నంబర్ కి +91 9390016028 వాట్సప్ మెసేజ్ చేయండి.
ఆత్మీయులైన బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకూ అందరికీ పేరుపేరునా నమస్కారం.
శుభోదయం.
అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
తొలి ఏకాదశి పండుగ రోజున మీ అందరితో ఒక శుభ వార్తను పంచుకుంటున్నాను. మా యొక్క సంకల్పమైన భక్త వీర హనుమాన్ భవ్య దేవాలయం నిర్మాణం పురోగతి జరుగుతున్నది.
గుడికి కావలసిన రాయి ఒక పదిహేను రోజులలో రానున్నది. కానీ దానిలో ఒక భాగంగా ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకున్నది. అది మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.
మన దేవాలయానికి ఆ శ్రీరాములవారి ఆశీస్సులు కూడా అందాయి. ఒక వారం క్రితం గుంటూరు, కొరిటిపాడులో నూతనముగా కళ్యాణ రామాలయం నిర్మించారు. దానిలో కొంత రాయి మిగిలింది. మా తమ్ముడు చందాల నిమిత్తం కొరిటిపాడులో వాకింగ్ ట్రాక్ దగ్గరలో వున్న పట్టాభి రామాలయంలోని స్వామి వారిని దర్శించుకొని అక్కడి పూజారిగారైన చక్రవర్తి గారితో మాట్లాడే సందర్భంలో ఆయన నూతనంగా కట్టబడిన కళ్యాణ రామాలయం లోని మిగిలిన ఆ రాయి నంతా ఉచితంగా (ఒక లారికి సరిపడా రాయి) మన దేవాలయ నిర్మాణానికి కమిటీ వాళ్ళతో మాట్లాడి ఇప్పించారు. అలా మన ఆంజనేయ స్వామి భవ్య దేవాలయానికి రాములవారి గుడి నుండి రాయి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము.
ఇదే ప్రకారంగా మా ఆశయం త్వరగా ఎటువంటి ఆటంకములు లేకుండా దిగ్విజయంగా సాగాలని ఆ కళ్యాణ రాముని ఆశీస్సులతో, రామ బంటుని ఆశీస్సులతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాను. దానికి మీ అందరి ఆశీస్సులు, సహకారం కావాలి.
అదేమిటంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నాను. మన గుడి నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరిగేవరకు “హనుమాన్ చాలీసా” పారాయణ మరియు “శ్రీరామ జయ రామ జయజయ రామ” అనే నామాన్ని ఎక్కువసార్లు పారాయణ చేయించాలని సంకల్పించాను. అందు నిమిత్తం ఒక పేరుతో లింక్ పంపిస్తాను. మీరు మీ దైనందిన కార్యక్రమాలలో భాగంగా ప్రతి రోజు చదువుతారుకదా. ఆ సంఖ్యనే గ్రూపులో పెట్టండి.
ప్రతి మంగళవారం నేను దానిని లెక్కించి total count mention చేస్తాను. కనీసం ప్రతిష్ఠ లోపు లక్ష చాలీసా చేయాలని మా సంకల్పం. అట్లానని ఏమి మొక్కు కాదు.
అందరి యొక్క సంకల్ప బలంతో మాకు త్వరగా గుడి నిర్మాణానికి కావలసిన వనరులు పుష్కలంగా సమకూరి త్వరిత గతిన భక్త వీర హనుమాన్ భవ్య దేవాలయం పూర్తి చేయాలనే సంకల్పంలో ఇది కూడా ఒక ప్రయత్నం.
ఎందుకంటే ఒక మహాత్తర సంకల్పమే ఒక ఆశయ సాధనకు ఎంతో దోహదపడుతుంది.ఎంత ఎక్కువ మంది సంకల్పం చేసుకుంటే అంత బలం మా ఈ ప్రయత్నానికి సహకరిస్తుంది. దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేస్తారని ఆశిస్తున్నాను. ఇది పూర్తిగా మీకు సమ్మతమైతే లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అయి పారాయణ ప్రారంభించండి. ఎక్కువ సార్లు చదవాలని రూల్ ఏమీలేదు. మీకు వీలైనన్ని సార్లు చదివి గ్రూపులో పెట్టండి.
మనలో చాలామంది ఉద్యోగస్తులు వున్నారుకదా. రోజుకు ఒక్క సారైనా చదువుతారు కదా. అదే పెట్టండి. ప్రతి రోజూ కౌంట్ పెట్టాలని లేదు. వారానికి ఒకసారైనా లేదా ప్రతి రోజైనా పెట్టండి. నేను కౌంట్ చేసుకుంటాను.
దీనికి సంకల్పం కూడా పెడతాను. మొదటిరోజు సంకల్పం చెప్పుకుని ప్రారంభించండి.
నా ఈ బృహత్తర కార్యక్రమానికి మీరందరూ సహకరించి ఆ అయోధ్య రాముని, భక్త వీర హనుమంతుని కృపకు పాత్రులు కాగలరని అందరినీ పేరు పేరునా కోరుకుంటున్నాను.
జై శ్రీరామ్
జై హనుమాన్
Note: పారాయణ వాట్సప్ గ్రూప్ లో సభ్యులు గా చేరటానికి ఈ నంబర్ కి +91 9390016028 వాట్సప్ మెసేజ్ చేయండి.
సంకల్పము
కనమర్లపూడి లోని భక్త వీర హనుమాన్ భవ్య దేవాలయం అతి త్వరిత గతిన పూర్తి అవ్వాలని, ఎటువంటి ఆటంకములు లేకుండా దిగ్విజయంగా ప్రతిష్ఠ జరగాలని సంకల్పం చెప్పుకుని పారాయణ ప్రారంభించండి.
ఈ సంకల్పం మొదటి రోజు చెప్పుకుంటే సరిపోతుంది. ఈ పారాయణకు ఎటువంటి నియమాలు లేవు. ఒకచోట కూర్చుని పారాయణ చేయాలనే నియమం లేదు.
పనులు చేసుకుంటూ కూడా రోజంతా ఏదో ఒక సమయంలో చేయవచ్చును.